
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వచ్చే నెల ఇన్వెస్టర్ల ముందుకు రాబోతోంది. కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఆగస్ట్ 2 న ఓపెనై 6 న ముగుస్తుంది. ఫ్రెష్‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ. 5,500 కోట్లను కంపెనీ సేకరించనుంది. ఈ ఫండ్స్‌ను సెల్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ కెపాసిటీని పెంచడానికి, ఆర్ అండ్ డీ కోసం ఖర్చు చేయనుంది.
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఆగస్ట్ 1 న ఓపెన్‌లో ఉంటుంది. కంపెనీ ప్రమోటర్లు, షేర్ హోల్డర్లు మరో 8.49 కోట్ల షేర్లను ఆఫర్ ఫర సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద ఐపీఓలో అమ్మనున్నారు. ఇందులో ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ భవీష్ అగర్వాల్ 3.8 కోట్ల షేర్లను అమ్మనున్నారు. షేరు ప్రైస్ రేంజ్‌ను సోమవారం కంపెనీ ప్రకటించనుంది. ఐపీఓ ద్వారా సేకరించే రూ.5,500 కోట్లలో రూ.1,227.6 కోట్లను తన సెల్ మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీని 5 గిగావాట్‌అవర్స్ నుంచి 6.4 గిగావాట్‌అవర్స్‌కు పెంచడానికి ఖర్చు చేయనుంది.
ఈ ఏడాది అక్టోబర్‌లో తమిళనాడులో నిర్మిస్తున్న గిగాఫ్యాక్టరీ మొదటి ఫేజ్ పూర్తవుతుందని అంచనా. ఫేజ్2 లో దీని కెపాసిటీని 6.4 గిగావాట్‌అవర్స్‌కు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పెంచాలని కంపెనీ చూస్తోంది. 2026 నాటికి దీనిని 20 గిగావాట్‌అవర్స్‌కు పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. మరో రూ.1,600 కోట్లను ఆర్ అండ్ డీకి, రూ.800 కోట్లను అప్పులు తీర్చడానికి, రూ.350 కోట్లను కంపెనీ అవసరాలకు వాడనుంది.